ఈవీఎం పగలగొట్టిన జనసేన అభ్యర్ధి
BY Telugu Gateway11 April 2019 4:07 AM GMT

X
Telugu Gateway11 April 2019 4:07 AM GMT
సాక్ష్యాత్తూ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధే ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు. దీంతో ఈవీఎం పగిలిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. జనసేన తరపున బరిలో నిలిచిన మధుసూధన్ గుప్తా ఆగ్రహంతో ఈ పనిచేశారు. ఓటింగ్ ఛాంబర్లలో అసెంబ్లీకి ఎక్కడ, పార్లమెంట్ కు ఎక్కడ ఓటు వేయాలని స్పష్టంగా రాయలేదని ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఆయన్ని సముదాయించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈవీఎంను పగలగొట్టడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story