కెసీఆర్ క్యాంప్ ఆఫీసు ముట్టడికి జనసేన యత్నం
BY Telugu Gateway25 April 2019 12:37 PM IST

X
Telugu Gateway25 April 2019 12:37 PM IST
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో చోటుచేసుకున్న అవకతవకలపై న్యాయ విచారణకు జనసేన పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణలో బోర్డు నిర్వాహకం వల్ల జరిగిన ఆత్మహత్యలకు సర్కారే బాధ్యత వహించాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సర్కారు తీరును నిరసిస్తూ జనసేన కార్యకర్తలు గురువారం నాడు హైదరాబాద్ లో సీఎం కెసీఆర్ క్యాంప్ కార్యాలయం, నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు ఇంటర్ బోర్డు వద్ద కూడా గురువారం కూడా ఆందోళనలు కొనసాగాయి.
Next Story



