Telugu Gateway
Politics

‘హాలిడేకు’ జగన్

‘హాలిడేకు’ జగన్
X

రాజకీయానికి రెస్ట్. ఏడాదిన్నరకు పైగా పాదయాత్ర.. ఆ తర్వాత అలుపెరగని ఎన్నికల ప్రచారం. ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు పెండింగ్. ఇప్పుడు నేతలు అందరూ విశ్రాంతి బాటలో ఉన్నారు. ఇప్పటికే పలువురు విదేశాల బాట చెక్కేయగా..తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ‘హాలిడే’ టూర్ కు వెళ్ళారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి స్విట్జర్లాండ్ వెళ్ళినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తిరిగి ఈ నెల 27న హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్నికల ముందే జగన్ విదేశీ పర్యటన పెట్టుకున్నా..సడన్ గా అది రద్దు అయిపోయింది.

ఇప్పుడు అంతా ఫ్రీ టైమ్ కావటంతో ఎవరి ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. మామూలుగానే వేసవి సెలవుల్లో టూర్లు వెళ్ళటం అత్యంత సహజం. అందునా ఎన్నికల ప్రచారంలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా తిరిగిన నేతలకు అయితే ఇది మస్ట్. కాస్త రిలాక్స్ అయి వస్తేనే మళ్లీ ఫుల్ జోష్. త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఫ్యామిలీతో కలసి సింగపూర్ టూర్ వెళతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇంకా షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉందని సమాచారం.

Next Story
Share it