Telugu Gateway
Telangana

ఇంటర్ ఫలితాల రగడ..విపక్షాలది రాజకీయం

ఇంటర్ ఫలితాల రగడ..విపక్షాలది రాజకీయం
X

ఇంటర్మీడియట్ ఫలితాల రగడపై విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఇంటర్మీడియట్ ఫలితాలను విపక్షాలు రాజకీయం చేయచూస్తున్నాయని ఆయన ఆరోపించారు. విపక్షాల యత్నాలు విద్యార్థుల మానసిక థైరాన్ని దెబ్బ తీసే విదంగా ఉందని విమర్శించారు. బాధ్యతా రాహిత్యం గా ప్రవర్తిస్తున్న విపక్షాల చిల్లర ప్రయత్నాలను విద్యార్థులు, తల్లి,తండ్రులు గమనిస్తున్నారని పేర్కొన్నారు.. ఫలితాలపై వస్తున్న అపోహలను తొలగించడానికే ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డులో అంతర్గత తగదాలా లేదా సాంకేతికత లోపమా అన్నది కమిటీ తెలుస్తుంది. ఈ అపోహలు ఎక్కడ సృష్టించబడ్డాయి. ఎప్పటి నుండి మొదలు అయ్యాయి అన్న అంశంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. త్వరలోనే బాధ్యులెవరో తెలుస్తాం.

ఈ అపోహలు ఆందోళనలకు కారణమైన కారకులపై చర్యలు కఠినంగా ఉంటాయి. కమిటీ తుది నివేదిక రాగానే చర్యలు మొదలుపెడుతాం. సాంకేతికంగా తప్పులు జరిగినవా లేదా అన్నది కమిటీ తెలుస్తుంది. కమిటీ వేసి నివేదిక రాకముందే విపక్షాలు చిల్లర ప్రయత్నాలకు దిగుతున్నాయి. కమిటీ వేగవంతంగా పనిచేస్తుంది. బుధవారం సాయంత్రం లేదా గురువారం నాటికి కమిటీ నివేదిక సమర్పించవచ్చు. ప్రభుత్వం నివేదిక కోసం ఎదురుచూస్తుంది. నివేదిక లో దోషులు తేలితే శిక్షలు కఠినంగా ఉంటాయి. పిల్లలు తల్లి,తండ్రులు ఆందోళన కు గురికావొద్దు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Next Story
Share it