Telugu Gateway
Cinema

రామ్ చరణ్ కు గాయం..ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు బ్రేక్

రామ్ చరణ్ కు గాయం..ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు బ్రేక్
X

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్‘ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఇటీవల వరకూ జోరుగా ముందుకు సాగింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పుణేలో జరుగుతోంది. అయితే జిమ్‌లో కసరత్తులు చేస్తున్న రామ్‌చరణ్‌ గాయపడటంతో షూటింగ్ వాయిదా పడింది. చరణ్‌ గాయం కారణంగా షూటింగ్ వాయిదా వేస్తున్నట్టుగా తెలిపిన చిత్రయూనిట్ మూడు వారాల తరువాత తిరిగి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను 2020 జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుమారు 350 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్నవిషయం తెలిసిందే.

Next Story
Share it