Telugu Gateway
Politics

కలకలం రేపుతున్న చంద్రబాబు తాజా వీడియో

కలకలం రేపుతున్న చంద్రబాబు తాజా వీడియో
X

ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలపై ఫిర్యాదు చేయటానికి అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నాడు ముఖ్య ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు. ఆ సమయంలో సీఈవోతో చంద్రబాబు వ్యవహరించిన తీరు దుమారం రేపుతోంది. స్వతంత్ర వ్యవస్థ అయిన సీఈవోను బెదిరిస్తున్న రీతిలో చంద్రబాబు మాట్లాడిన వీడియో ఒకటి బహిర్గతం అయింది. ఇది బయటకు ఎలా వచ్చింది అన్నది తెలియదు కానీ...సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. చంద్రబాబు బెదిరిస్తున్నట్లు మాట్లాడుతుండగా..ద్వివేది మాత్రం మౌనంగా వింటూ కూర్చున్నారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేపటం ఖాయంగా కన్పిస్తోంది. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘ఎవరు వెరిఫైంగ్ అథారిటీ అండీ. మీరు చూడాలి. లేదంటే వాళ్లు చూడాలి. నిజాలు చూడనివ్వండి. ఇక మీ ఆఫీస్ ఎందుకు?. క్లోజ్ చేసేయండి. ఎలక్షన్ కమిషన్ ఎవరు?. నేను అడుగుతున్నా.

సరిగా కండక్ట్ చేయలేకపోతే. ఏకపక్షంగా చేయండి. మిషన్లు పెట్టుకుని రిగ్గింగ్ చేసుకుంటారు. అయిపోతుంది దేశంలో ఎలక్షన్స్. మేం అందరం ఇంట్లో పడుకుంటాం. మేం ఎందుకు కష్టపడాలి. ఎందుకు ఈ మీటింగ్ లు మాకు. మేం అడిగేది ఏంటి? మీరు ఇండిపెండెంట్ ఆథారిటీ అవునా..కాదా?. ఢిల్లీ చెప్పినట్లు యాజ్ టీజ్ గా మీరు ఎందుకు ఫాలో కావాలి?.మీ ఆత్మసాక్షిగా ఉందిగా. నేను అడుగుతున్నా. మీది పోస్ట్ ఆఫీస్ కాదు. మీకు అధికారాలు ఉన్నాయి. లేకపోతే రద్దు చేయమనండి. అందరినీ తీసేయమనండి. ఓ క్లర్క్ పెట్టుకుని చేసేయమనండి. మేం చూస్తాం. రేపు ఎలక్షన్ కమిషన్ ఏంటో. అంత ఈజీగా నేను వదిలిపెట్టను. నేను టేకప్ చేశానంటే లాజికల్ గా పోవాల్సిందే’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ వీడియో అంతా చూస్తుంటే చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాలను ధిక్కరించాల్సిందిగా సీఈవోకు సూచిస్తున్నట్లు ఉంది. ఇదే తరహాలో సీఈసీ నిర్ణయానికి వ్యతిరేకం పనిచేసిన ఏపీ సీఎస్ పునేతా ఏకంగా సీఎస్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

https://www.facebook.com/rama.patibandla/videos/806521223062054/

Next Story
Share it