Telugu Gateway
Telangana

శివాజీకి టీవీ9 షేర్లు ఎలా వచ్చాయి?

శివాజీకి టీవీ9 షేర్లు ఎలా వచ్చాయి?
X

ఇదే ఇప్పుడు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్. ఈ మధ్యే టీవీ9లో మెజారిటీ వాటా కలిగిన శ్రీనిరాజు తన వాటాలను అమ్మేసుకుని బయటకు వెళ్లిపోయారు. ఆయన ఎప్పటి నుంచో టీవీ9 నుంచి ఎగ్జిట్ అయ్యేందుకు పలు ప్రయత్నాలు చేసినా..ఇటీవల వరకూ అవి కార్యరూపం దాల్చలేదు. కొద్ది నెలల క్రితమే శ్రీనిరాజు తాను కోరుకున్న విధంగా మీడియా ఛానల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. మారిషస్ కు చెందిన సైఫ్ సంస్థ ఈ డీల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నేరుగా సైఫ్ కు ..టీవీ9కు ఎలాంటి సంబంధం లేదు. అయితే శ్రీనిరాజుకు చెందిన ఐ విజన్ మీడియాలో సైఫ్ పెట్టుబడులు పెట్టింది. తమ పెట్టుబడికి ఎలాంటి ప్రతిఫలం చూపించకుండానే శ్రీనిరాజు షేర్లు విక్రయించటంపై సైఫ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సీఎల్ టీ)లో ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ వివాదంపై ఎన్ సీఎల్ టీ బయట సెటిల్ చేసుకునేందుకు శ్రీనిరాజు, సైఫ్ లు ఓ అంగీకారానికి వచ్చాయని ప్రముఖ ఆంగ్ల ప్రత్రిక ‘ఎకనమిక్ టైమ్స్’ తన కథనంలో పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా సుమారు 65 కోట్ల రూపాయలను సైఫ్ సంస్థకు చెల్లించటానికి శ్రీనిరాజు అంగీకరించినట్లు తెలిపారు. ఇదంతా ఒకెత్తు అయితే అసలు సినీ నటుడు శివాజీకి టీవీ9 షేర్లు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.

అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎబీసీఎల్) వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాష్ కు ఉన్న సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వాటాలను శివాజీ కొనుగోలు చేసినట్లు ఆ కథనం పేర్కొంది. ఆ వాటాలను అడ్డం పెట్టుకునే శివాజీ తరపు లాయర్ ఎన్ సీఎల్ టీలో తమ వాదనలు కూడా వినాలని..తమకు ఎలాంటి సమాచారం లేకుండా శ్రీనిరాజు వాటాల విక్రయం జరిగిందని వాదించినట్లు సమాచారం. 82 శాతం వాటా ఉన్న శ్రీనిరాజు వాటా విక్రయాన్ని ఇఫ్పుడు శివాజీ తరపు లాయర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు సైఫ్, శ్రీనిరాజు కోర్టు వెలుపల ఓ అంగీకారానికి రావటంతో శివాజీ మాట ఏ మేరకు చెల్లుబాటు అవుతుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరం.

Next Story
Share it