Telugu Gateway
Politics

రాహుల్ గాంధీకి హోం శాఖ నోటీసులు

రాహుల్ గాంధీకి హోం శాఖ నోటీసులు
X

పౌరసత్వ వివాదం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోం శాఖ నోటీసులు జారీ చేసింది. తమకు అందిన ఫిర్యాదుపై పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయటం సుబ్రమణ్యస్వామికి అలవాటేనని విమర్శించింది. ఇదే అంశంపై రాహుల్ నామినేషన్లపై కొంత మంది ఫిర్యాదు చేయగా రిటర్నింగ్ అధికారులు మాత్రం అంతా సవ్యంగానే ఉందని వాటిని ఓకే చేశారు.

రాహుల్‌ గాంధీకి నాలుగు పాస్‌పోర్ట్‌ లు ఉన్నాయని, ఒకదానిపై ఆయన పేరు రౌల్‌ విన్సీ, క్రిస్టియన్‌గా నమోదైందని సుబ్రఃహ్మణ్య స్వామి ఇటీవల ఆరోపించారు. మరోవైపు రాహుల్‌ పౌరసత్వంపై ఆమేధిలో ఆయనపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన ధ్రవ్‌లాల్‌ సైతం ఫిర్యాదు చేశారు. బ్రిటన్‌లో ఓ కంపెనీ నమోదు సమయంలో రాహుల్‌ గాంధీ తాను బ్రిటన్‌ పౌరుడినని ప్రకటించుకున్నారని ధ్రువ్‌లాల్‌ న్యాయవాది రవిప్రకాష్‌ పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయేతరులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని చెప్పారు.

Next Story
Share it