Telugu Gateway
Cinema

‘డియర్ కామ్రెడ్’ షూటింగ్ పూర్తి

‘డియర్ కామ్రెడ్’ షూటింగ్ పూర్తి
X

టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ కాంబినేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన. వీరిద్దరూ కలసి చేసిన సినిమా ‘గీత గోవిందం’ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ జోడీగా నటించిన సినిమానే ‘డియర్ కామ్రెడ్’. తొలి సినిమాలో ఓ ముద్దే సినిమా కథ అంతా తిప్పగా..ఈ సినిమాలో ఏకంగా లిప్ లాక్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. అయితే ఇది ఏ సందర్భంలో వస్తుందో..ఆ ముద్దు కథ ఏంటో సినిమా విడుదల అయితే కానీ తెలియదు. భరత్ కమ్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్‌తో కలిసి దిగిన పిక్‌ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ప్యాకప్ చేశామని పేర్కొన్నాడు డైరెక్టర్ భరత్ కమ్మ. ఈ మేరకు ‘‘దాదాపు సంవత్సరం పాటు షూటింగ్ చేశాం. గ్రేట్ జర్నీ.. అందరినీ మిస్ అవుతున్నా గైస్..’’ అంటూ ట్వీట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ‘డియర్ కామ్రెడ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదల కానుంది.

Next Story
Share it