‘చిత్రలహరి’ కొత్త పాట వచ్చేసింది

X
సాయి ధరమ్ తేజ్ లక్ మారబోతోంది. ఎందుకంటే ‘చిత్రలహరి’ సినిమా ఆయనకు విజయం అందించటం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్..పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ మరో పాటను విడుదల చేసింది. ‘ప్రేమ వెన్నెలా ..రావే ఊర్మిలా’ అంటూ సాగే ఈ పాట కూడా మరో హిట్ సాంగ్ గా కనపడుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్, నివేదా హేతురాజ్ లు నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
https://www.youtube.com/watch?v=JRhyE54jc8s
Next Story



