‘చిత్రలహరి’ ట్రైలర్ విడుదల

సినిమా విడుదలకు ముహుర్తం దగ్గర పడటంతో చిత్రలహరి యూనిట్ ప్రచార స్పీడ్ పెంచింది. అందులో భాగంగా ‘ట్రైలర్’ను విడుదల చేసింది. టీజర్ తోనే అంచనాలు ఓ రేంజ్ లో పెంచిన సాయి ధరమ్ తేజ్ ట్రైలర్ ద్వారా సినిమా హిట్ అనే సంకేతాలు పంపారు. చిత్రలహరి సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జోడీగా కళ్యాణి ప్రియదర్శిని, నివేదా హేతురాజ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘స్విగ్గిలో పెట్టినా ఆర్డరా ఇంట్లో కూర్చుంటే గంటలో రావటానికి. సక్సెస్...టైమ పడుతుంది. చీకటికి చిరునామా నేను. ఓ ప్లేట్ సక్సెస్ కావాలి తీసుకురాపో.’ వంటి ఎన్నో ఆసక్తికర డైలాగ్ లు..సన్నివేశాలు ట్రైలర్ లో ఉన్నాయి. చిత్రలహరి సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
https://www.youtube.com/watch?time_continue=4&v=tBax6qOUECU