Telugu Gateway
Politics

అవినీతి గురించి మాట్లాడే అర్హత మోడీకి ఉందా?

అవినీతి గురించి మాట్లాడే అర్హత మోడీకి ఉందా?
X

ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు మోడీకి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. తాను డిజిటల్ కరెన్సీకి వెళ్ళమంటే వెళ్ళలేదని..మీ స్వార్ధం కోసం దేశాన్ని తగలపెడతారా? అని మోడీనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న అంశాలపై మేధావులు, యువత స్పందించాలని చంద్రబాబు కోరారు. తాను ఏ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వెళితే అక్కడ ఐటి దాడులు చేయటం వెనక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బిజెపి నేతల ఇళ్ళపై దాడులు ఉండవు. బిజెపి ముఖ్యమంత్రులు హెలికాఫ్టర్లు తనిఖీ చేయరు. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి, ఒరిస్సా ముఖ్యమంత్రులు హెలికాప్టర్లు మాత్రం చెక్ చేస్తారు. ఇదెక్కడి పద్దతి అని ధ్వజమెత్తారు.అసలు రెండు వేల రూపాయల నోటు తేవాలని ఎవరు అడిగారు?. దేశానికి ఈ అంశంపై మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఇంతగా సందేహస్పదం చేయటం ఏ మాత్రం సరికాదన్నారు. అనుమానాలపై ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలా అని ప్రశ్నించారు. ఏపీలో ఆరు వేల మందిని ఎవరు నియమించారు.

ఈవీఎంల్లో సమస్యలు వస్తే వీరు ఎక్కడికి పోయారన్నారు.తనకు ఎవరిపైనా వ్యక్తిగతం ద్వేషం లేదని..ఏ పార్టీపై వ్యతిరేకత లేదన్నారు. తన పోరాటం దుష్టపాలనపై మాత్రమే అని వ్యాఖ్యానించారు.తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించి సారీతో సరిపెడతారా? అని నిలదీశారు. ఓట్ల దొంగల ఐపి అడ్రస్ లు ఎందుకు ఇవ్వరన్నారు. చేతకాకపోతే ఎందుకు ఆన్ లైన్ లో ఫిర్యాదులు తీసుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు బుధవారం నాడు పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ర రాబోయే అరవై రోజుల పనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. జూన్ -జూలైలో గ్రావిటీ ద్వారా నీరు అందించటానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Next Story
Share it