Telugu Gateway
Politics

ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు చంద్రబాబు ధర్నా

ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు చంద్రబాబు ధర్నా
X

ఎన్నికలకు ఒక రోజు ముందు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగటం కలకలం రేపుతోంది. ప్రతిపక్ష వైసీపీ చేసిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ..తమ పిర్యాదులను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ ఆయన ధర్నాకు దిగారు. సీఈసీ ఏకపక్షంగా చర్యలు తీసుకుంటోందని..టార్గెట్ గా ఐటి దాడులు చేస్తున్నారని..ఇది ఏ మాత్రం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో పరిస్థితి కేంద్ర ఎన్నికలం సంఘం (సీఈసీ) దృష్టికి తీసుకెళ్ళాలని ముఖ్య ఎన్నికల అధికారిని కోరారు.ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ విషయంలో ఎలాంటి విచారణ చేయకుండా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు.

ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర అధికారులను బదిలీ చేయటాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారు. సీఈవోకి తమ ఫిర్యాదును అందజేసిన అనంతరం చంద్రబాబు కార్యాలయం ముందు మెట్ల పై కూర్చుని నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలోని రిటైర్డ్ ఐఏఏస్, ఐపీఎస్ అదికారులు కూడా సీఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోడీ ఏది చెపితే అది చేసే పరిస్థితికి వచ్చారన్నారు.

Next Story
Share it