కెసీఆర్ కు సీఈసీ నోటీసులు
BY Telugu Gateway10 April 2019 5:03 PM IST

X
Telugu Gateway10 April 2019 5:03 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో కెసీఆర్ హిందువులను కించపరిచారనే అంశంపై ఫిర్యాదులు అందాయి. దీనిపై నివేదిక కోరిన సీఈసీ ఈ నెల 12వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేశారు.
మార్చి 17న కరీంనగర్ బహిరంగ సభలో కెసీఆర్ హిందువుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు వెళ్ళాయి.మరోవైపు కేసీఆర్కు ఈసీ నోటీసులు జారీ చేయడాన్ని వీహెచ్పీ స్వాగతించింది. టీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కేసీఆర్కు చట్టపరంగా శిక్షపడేవరకూ తాము న్యాయపోరాటం చేస్తుందని వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు.
Next Story