ఆంధ్రజ్యోతి ఎండీపై కేసు నమోదు
BY Telugu Gateway8 April 2019 10:55 AM GMT

X
Telugu Gateway8 April 2019 10:55 AM GMT
ఏపీ రాజకీయం ఎన్నోమలుపులు తిరుగుతోంది. వైసీపీని దెబ్బతీసేందుకు ఆంధ్రజ్యోతి పత్రిక, ఛానల్ లు పనిచేస్తున్నాయని..తనది కాని వాయిస్ తో తన ఆడియో టేప్ అని ప్రసారం చేసిన సంస్థ ఎండీపై వి. రాధాకృష్ణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసును పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై న్యాయ సలహా అనంతరం పోలీసులు ఇవాళ... సెక్షన్లు 171సి, 171జీ, 171ఎఫ్, 469,505(2) కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే రాధాకృష్ణకు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.
Next Story