ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల ఇప్పట్లో లేనట్లే!
BY Telugu Gateway3 April 2019 5:17 PM IST

X
Telugu Gateway3 April 2019 5:17 PM IST
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో విడుదల ఇప్పట్లో జరిగేలా కన్పించటం లేదు. వాస్తవానికి బుధవారం నాడు సినిమాను చూసి..విడుదలపై నిర్ణయం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన హైకోర్టు ఈ కేసును ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల లోపు సినిమా విడుదల అనుమానమే.
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున తాము సినిమా చూడటం కూడా సరికాదని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించి..విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి సినిమా కాపీని తీసుకుని కోర్టుకు హాజరయ్యారు. అయినా హైకోర్టు న్యాయమూర్తులు సినిమా చూడటానికి అంగీకరించలేదు. తెలంగాణలో మార్చి 29న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళుతోంది.
Next Story