Telugu Gateway
Politics

కాంగ్రెస్ కు బండ్ల గణేష్ గుడ్ బై

కాంగ్రెస్ కు బండ్ల గణేష్ గుడ్ బై
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ తరపున హల్ చల్ చేసిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘వ్యక్తిగత కారణాల తో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడిని కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను.’ అని పేర్కొన్నారు.

గత ఎన్నికల ముందు బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని..లేకపోతే తాను గొంతు కోసుకుంటానని మీడియా ముందు హంగామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే తాజాగా మరో ట్వీట్ లో బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

Next Story
Share it