Top
Telugu Gateway

‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా లీక్ కలకలం

‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా లీక్ కలకలం
X

యూత్ నోట ప్రస్తుతం ఒకటే మాట. అదే ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ మూవీ. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసేయాలని యమా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అందుకే అడ్వాన్స్ బుకింగ్ ల రోజు మల్టీఫ్లెక్స్ ల దగ్గర ఉదయం ఏడు గంటలకే కుర్రకారు క్యూకట్టారు. ఒక్క హైదరాబాద్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఫీవర్ నడుస్తోంది. ఈ తరుణంలో షాక్ లాంటి వార్త వెలువడింది. పైరసీ సినిమాలను అలవోకగా విడుదల చేసే సైట్ తమిళరాకర్స్ విడుదలకు రెండు రోజుల ముందే ఆన్ లైన్ లో ఈ సినిమాను పెట్టేసింది. అయితే ఈ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లలో చూడటానికే ఇష్టపడతారు తప్ప..పైరసీ సైట్లలో చూడటానికి ఏ మాత్రం ఆసక్తిచూపరు. శుక్రవారం నాడు భారత్ లో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే చైనా, జర్మనీ, సింగపూర్, యూఏఈ దేశాల్లో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో కూడా ఈ సినిమాకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ భారీ స్థాయిలో కనిపిస్తున్నాయి. భారత్ లో ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. చైనాలో ఈ సినిమా తొలి రోజు సంచనాలు నమోదు చేసింది. ఒక్క రోజులోనే దాదాపు 750 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా చెప్పుతున్నారు. దీంతో తొలి రోజు ఆసియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ చరిత్ర సృష్టించింది. ఈ ఊపు చూస్తుంటే అవతార్ సినిమా రికార్డ్‌ లు కూడా బద్ధలవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ‘

Next Story
Share it