Telugu Gateway
Politics

ఏపీలోఆ ‘కసి’ ఎవరిపై !

ఏపీలోఆ ‘కసి’ ఎవరిపై !
X

వార్ వన్ సైడైనా?. ఏపీలో ఆ కసి ఎవరిపై?. ఏనభై శాతం వరకూ చేరనున్న పోలింగ్ శాతం దేనికి సంకేతం?. ఇది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. గోదావరి జిల్లాల్లో ఇసుక దోపిడీ చేసిన నేతలను కసితీరా ఓడించాలని అక్కడి ప్రజలు కంకణం కట్టుకున్నారనే సంకేతాలు స్పష్టంగా వెల్లడవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండగా..పనికి ఆహార పథకం దోపిడీ ఎలా అయితే టీడీపీపై ప్రతికూల ప్రభావం చూపించిందో..ఏపీలో గత ఐదేళ్ళుగా సాగిన ఇసుక దోపిడీ కూడా ఇప్పుడు అంతే ప్రభావం చూపించబోతంది. ఇది ఎక్కువ మంది మాట. పలు జిల్లాలో పోరు ఏకపక్షంగా సాగినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. సహజంగా ఎప్పుడైనా ప్రజల్లో ఆగ్రహం ఎక్కువగా అధికార పార్టీపైనే ఉంటుంది. అంతే కానీ ప్రతిపక్షంపై కసి ఉండే సందర్భాలు అరుదు. మరి ఇప్పుడు ఏపీలో 80 శాతానికి చేరువలో ఉన్న ఓటింగ్ శాతం ఎవరిపై కసి చూపించిందో తెలియాలంటే మే 23 వరకూ ఆగాల్సిందే. అయితే పార్టీల అంతర్గతం అంచనా ప్రకారం ‘లెక్కలు’ తేలిపోతూనే ఉన్నాయి. అయినా సరే అధికారిక ఫలితమే అంతిమం కాబట్టి అప్పటి వరకూ ఆగాల్సిందే. పలు జిల్లాల్లో ఓట్లు వేసిన అనంతరం ఎవరికి ఓటు వేసింది బహిర్గతం చేయటానికి అంతగా ఇష్టపడరు.

కానీ ఈ సారి మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా ఎవరికి ఓటు వేశామో స్పష్టంగా బయటకు చెప్పేశారు. దీన్ని బట్టి ఫలితం ఏంటో తేలిపోతూనే ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో వారికి కూడా స్పష్టమైన సంకేతాలు అందాయి. అయితే గురువారం నాడు జరిగిన పోలింగ్ లో ఈవీఎంలు పలు చోట్ల మొరాయించటం పెద్ద చికాకుగా మారింది. అయినా సరే పోలింగ్ శాతం పెరగటం విచిత్రంగా ఉంది. రాత్రి పది గంటల తర్వాత కూడా ఏకంగా 400 బూత్ ల్లో పోలింగ్ సాగుతుంది అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. పలు జిల్లాల్లో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 25 ఘర్షణలు చోటుచేసుక్నుట్టు పోలీసు శాఖ తెలిపింది. ఆరు చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఆ ఘటనల్లో ఇద్దర మరణించగా, కొందరు గాయపడ్డారు.

Next Story
Share it