‘ఐకాన్’గా అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది.శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ ను ‘ఐకాన్’గా ఖరారు చేశారు. దీని ఉప శీర్షికగా కనపడుట లేదు పెట్టారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. సోమవారం బన్నీ పుట్టిన రోజు కానుకగా ఆ సినిమాను అఫీషియల్‌గా ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజా సినిమా ప్రకటనతో ఈ ఏడాది బన్నీ మూడు సినిమాలు అఫీషియల్‌గా ప్రకటించినట్లు అయింది.
సుకుమార్ దర్శకత్వంలో కూడా బన్నీ మరో సినిమా చేయనున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కేది అల్లు అర్జున్ 20వ సినిమా అయితే..దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనుంది. ఇందులో స్టైలిష్ స్టార్ కు జోడీగా రష్మిక మందన నటించనున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాలకు అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డె నటించనుంది.