పవన్ పై పోటీ చేస్తానంటున్న వర్మ
BY Telugu Gateway28 March 2019 12:18 PM IST

X
Telugu Gateway28 March 2019 12:18 PM IST
రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా సంచలనమే. ఆయన ఓ వైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి హంగామా చేస్తూనే రాజకీయాలకు సంబంధించి ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. అదేంటి అంటే నామినేషన్ల దాఖలు గడువు ముగిసిపోయిన తర్వాత వచ్చి..తాను పవన్ కళ్యాణ్ పై భీమవరంలో పోటీచేస్తానని ప్రకటించారు. అసలు వర్మ ఉద్దేశం ఏమిటా? అని ఇఫ్పుడు జనం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్‌కు కొన్ని గంటలు మాత్రమే ఉన్న సమయంలో ఈసంచలన ట్వీట్‌తో మరో సారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే నామినేషన్ల గడువు ముగిసినా తనకు పై స్థాయి నుంచి పోటి చేసేందుకు పర్మిషన్ వచ్చిందని, పూర్తి వివరాల కోసం వేచి ఉండాలంటూ ట్వీట్ చేశాడు వర్మ. అదేంటో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే.
Next Story



