వైసీపీ అభ్యర్ధుల జాబితా విడుదల 16కి వాయిదా
BY Telugu Gateway13 March 2019 5:46 AM GMT

X
Telugu Gateway13 March 2019 5:46 AM GMT
వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసే అభ్యర్దుల జాబితా విడుదల వాయిదా పడింది. వాస్తవానికి తొలి జాబితా బుధవారం ఉదయమే వెలువడాల్సి ఉన్నా..పార్టీలో చేరికలు ఎక్కువగా ఉండటం..జాబితా ఖరారులో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా దీన్ని వాయిదా వేసినట్లు వైసీపీ ప్రకటించింది. కొత్త తేదీ ప్రకారం మార్చి 16న వైసీపీ అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోని ఇడుపులపాయలోనే విడుదల చేయనున్నారు.
అక్కడ నుంచే ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 16న ఉదయం 10.26 నిమిషాలకు జాబితా విడుదల ముహుర్తంగా నిర్ణయించారు. పార్టీకి చెందిన కోర్ కమిటీ బుధవారం ఉదయం సమావేశం అయినా కూడా చేరికలు ఎక్కువగా ఉండటంతో జాబితా విడుదల ముహుర్తం దాటిపోయింది. అదే సమయంలో జగన్ బస్సు యాత్ర..ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలపై పార్టీ నేతలతో చర్చించి యాక్షన్ ప్లాన్ ఖరారు చేస్తున్నారు.
Next Story