Telugu Gateway
Politics

కాంగ్రెస్ కే మా అవసరం..మాకేమీ లేదు

కాంగ్రెస్ కే మా అవసరం..మాకేమీ లేదు
X

‘మాకు కాంగ్రెస్ తో ఎలాంటి అవసరరం లేదు. కాంగ్రెస్ కే మా అవసరం ఉంటుంది. కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ ల కు మేం సమాన దూరం. ప్రత్యేక హోదా కు ఎవరు మద్దతు ఇస్తే వారికే మా మద్దతు. అది రాహుల్ కావొచ్చు..మరెవరైనా కావొచ్చు. ఏపీలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది?. ఉనికి లేకపోవటం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇటీవల వరకూ బద్ధ విరోధిగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకుంది. మాకు అలాంటి అవసరం లేదు’ అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి శనివారం నాడు ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఏపీ నూతన రాజధాని అమరావతికి సంబంధించి జాతీయ మీడియా వేదికగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ రాజధాని ప్రాంతంలో ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేసిందని తెలిపారు. ఒక్క హెరిటేజ్ కాకుండా..చంద్రబాబు బినామీలు అందరూ ఇదే పనిచేశారని ఆరోపించారు. ఇది ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ కాక మరేమిటని ప్రశ్నించారు. పూలింగ్ అనే పేరుతో భూ సేకరణ చేశారని విమర్శించారు. ఇది ఓ పెద్ద కుంభకోణం అని ఆరోపించారు.

ప్రజలకు ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని వైఎస్‌ జగన్‌ తప్పుబట్టారు పాదయాత్ర ద్వారా 14 నెలలు ప్రజల మధ్యలో ఉన్నాను. పాదయాత్ర పొడుగుతా ప్రజల కష్టసుఖాలు వింటూ.. వారి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అన్నది క్షుణ్ణంగా తెలుసుకున్నాను. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసాను ఇచ్చాను. ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది నా లక్ష్యం. అందుకు ఏం చేయాలన్నది పాదయాత్ర ద్వారా ప్రజల మధ్య ఉండి నిశితంగా గమనించాను. నా తొమ్మిదేళ్ల రాజకీయ ప్రయాణం అంతా ప్రజల మధ్యలోనే గడిచింది. ఏ దారిలో నడుస్తున్నా.. ఎక్కడ ఉంటున్నా ఉన్నది ప్రజలకు సమాచారం ఇస్తూ.. వారితో కలిసి నడిచాను. వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలుసుకున్నాను. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్లో చాలావరకు కొందరు వ్యక్తులు సృష్టించినవే. ఎన్నికలకు ముందు చంద్రబాబె ఎన్నో హామీలు ఇచ్చారు. గెలిచి అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తెలిసినా.. చేస్తానని వాగ్దానం చేసి.. అన్నదాతలను మోసం చేశారు.

రుణమాఫీ చేయకపోవడంతో అంతకుముందు వరకు వచ్చే వడ్డీలేని రుణాలను కూడా ఇప్పుడు రైతులు పొందలేకపోతున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి.. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేవిధంగా నిర్ణయాలు తీసుకుంటాం. మేం ప్రకటించిన నవరత్నాల పథకంతో సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది జాతీయ స్థాయిలో ఉన్న రెండు పార్టీలు ఏపీని మోసం చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ ఒక్కటైపార్లమెంటులో రాష్ట్రాన్ని విభజించాయి.. విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వకపోవడంతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ఏపీలో చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి?’ అని జగన్ ప్రశ్నించారు.

Next Story
Share it