Telugu Gateway
Politics

పసుపు పార్టీకి ఈ సారి పశ్చిమ గోదావరిలో షాక్ తప్పదా!

పసుపు పార్టీకి  ఈ సారి  పశ్చిమ గోదావరిలో షాక్ తప్పదా!
X

గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా అంతా ‘పసుపు’ పార్టీ వైపే ఉంది. జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా..ఏకంగా 14 సీట్లలో టీడీపీ విజయ బావుటా ఎగరేసింది. మరో సీటును కూడా అప్పటి టీడీపీ మిత్రపక్షం బిజెపి దక్కించుకుంది. మరి 2019 ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. గోదావరి జిల్లాల తీర్పే ఏపీలో రాజకీయ పార్టీల భవిష్యత్ ను నిర్ణయిస్తుందనే విషయం తెలిసిందే. అందునా ఇఫ్పుడు ఎన్నికలు అత్యంత హోరాహోరీగా సాగుతున్నాయి. దీంతో అందరి దృష్టి పశ్చిమ గోదావరి జిల్లాపై పడింది. అందునా గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి ఏకపక్ష తీర్పు వచ్చింది ఇక్కడ. అయితే ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ సారి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపక్ష వైసీపీ భారీగా పుంజుకోవటం ఖాయం అనే సంకేతాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం వైసీపీ అభ్యర్ధులు ఏకంగా పది స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన అంశం.

అందులో తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఉంగుటూరు, ఏలూరు, నిడదవోలు, నరసాపురం, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాలు అయిన ఆచంట, ఉండి, తణుకు, దెందులూరు అధికార టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న భీమవరరం నియోజకవర్గంలో రాజకీయం మాత్రం హాట్ హాట్ గా ఉంది. అయితే ఇక్కడ ఇప్పటికిప్పుడు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పే పరిస్థితి మాత్రం లేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన రైతు రుణ మాఫీ విషయంలో సర్కారు వైఫల్యం ఈ జిల్లాలో ప్రధాన అంశంగా మారింది. దీనికి తోడు అడ్డగోలుగా ఇసుక దోపిడీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న విపరీతమైన వ్యతిరేకత అధికార టీడీపీని దెబ్బతీసే అంశాలుగా ఉన్నాయి.

Next Story
Share it