Telugu Gateway
Cinema

సూర్య‌కాంతం ట్రైల‌ర్ విడుద‌ల‌

సూర్య‌కాంతం ట్రైల‌ర్ విడుద‌ల‌
X

కొణిదెల నిహారిక న‌టిస్తున్న చిత్రం సూర్య‌కాంతం. ఈ సినిమా మార్చి 29నే ప్రేక్షకుల ముందుకు రానుంది. గ‌త కొంత కాలంగా నిహారిక ప‌లు ప్ర‌య‌త్నాలు చేసినా ఆమెకు ఒక్క‌టంటే ఒక్క సినిమా హిట్ ఇవ్వ‌లేదు. దీంతో ఈ మెగా వార‌సురాలు కొత్త సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం నాడు ట్రైల‌ర్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో నిహారిక‌దే కీల‌క‌పాత్ర కాగా..హీరోగా రాహుల్‌ విజయ్ న‌టిస్తున్నారు.

దగ్గుబాటి రానా చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయించింది చిత్రబృందం. ఇద్ద‌రు యువ‌తుల మధ్యలో నలిగే యువకుడిగా రాహుల్‌ విజయ్‌.. భిన్నమైన స్వభావం ఉండే ఓ క్యారెక్టర్‌లో నిహారిక నటిస్తున్నారు. ‘నాకు ఇన్‌డైరెక్ట్‌గా ప్రపోజ్‌ చేశావ్‌.. యెదవా!’, లాంటి డైలాగ్‌లతో ఉన్న ఈ ట్రైలర్‌లో నిహారిక ఆకట్టుకున్నారు. మార్క్‌ కె రూబిన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=nEBGu3Lqv2A

Next Story
Share it