తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ వే

తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తన పట్టు నిరూపించుకుంది. తొలుత ఒక స్థానానికి గూడూరు నారాయణరెడ్డిని పోటీకి దింపిన కాంగ్రెస్ పార్టీ మారిన పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎన్నికలు జరిగిన ఐదుస్థానాల్లో నాలుగు టీఆర్‌ఎస్, మిత్రపక్షమైన ఎంఐఎం ఒక స్థానంలో గెలిచాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలుగా శేరిసుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేషం, సత్యవతి రాథోడ్, మహ్మద్ అలీలు గెలిచారు.
ఎంఐఎం తరపు నుంచి రియాజుల్ హసన్ గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు 20 చొప్పున ఓట్లు రాగా.. ఎంఐఎం అభ్యర్థికి 19 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించడంతో టీఆర్‌ఎస్ గెలుపు మరింత తేలికైంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా అనుకున్నట్లే జరిగింది. కాంగ్రెఎస్, టీడీపీ, బిజెపిలు ఈ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.