టీడీపీకి తోట నరసింహం గుడ్ బై
BY Telugu Gateway12 March 2019 7:24 AM GMT

X
Telugu Gateway12 March 2019 7:24 AM GMT
లోక్ సభలో తెలుగుదేశం పార్టీ పక్షనేతగా ఉన్న తోట నరసింహం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో అధికార టీడీపీ నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారినట్లు అయింది. ఆయన బుధవారం నాడు వైసీపీలో చేరనున్నారు. అనారోగ్య కారణాలతో తాను ఎంపీ బరిలో ఉండలేనని..తన భార్యకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని తోట నరసింహం టీడీపీ అధిష్టానాన్ని కోరారు.
అందుకు టీడీపీ నో చెప్పటంతో ఆయన పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తోట నరసింహం భార్యకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఆయన మంగళవారం నాడు పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story