Telugu Gateway
Politics

డేటా చోరీ..టీడీపీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

డేటా చోరీ..టీడీపీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
X

డేటా చోరీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తెలంగాణ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ‘ఉచ్చు’ బిగిస్తున్నారు. సర్వేల పేరుతో ఓటర్ల ‘రాజకీయ ప్రాధాన్యత’లు కనుక్కొని ఓట్లను తొలగిస్తున్నారని..ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం ఆధారం మూడు కేసులను పరిశీలించగా అందులో ఈ విషయం వాస్తవమే అని తేలిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. అయితే ఈ ఓట్ల తొలగింపు ఏ స్థాయిలో జరిగింది..ఎంత మేర చేశారు అన్నది తదుపరి విచారణలోనే తేలుతుందని ప్రకటించారు. సర్వేలో ఇతర అంశాలతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారనే కాలమ్ కూడా ఉందని..దీని ఆధారంగానే కొన్ని ఓట్లను తొలగించినట్లు గుర్తించామని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించి..సీఈసీ ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసు పెట్టిన వ్యక్తి హైదరాబాద్ లో ఉంటున్నారని...పైగా వారు బాధితులు అని చట్టప్రకారమే తాము ముందుకు సాగుతున్నామని..సాగుతామని తేల్చిచెప్పారు. ఐటి గ్రిడ్ ద్వారా ఎంత మందిని సర్వే చేశారు అనే డేటా తమ దగ్గర లేదన్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన వివరాల్లో ఆధారాలు ఉన్నాయని..అవి పరిశీలించాకే తాము ముందుకు సాగామని తెలిపారు.

ప్రతి సర్వేలో కీ పర్సన్ అని ప్రస్తావించారని.. ఇది ఓ కోడ్ లా కన్పిస్తోందని తెలిపారు. మన గవర్నమెంట్ డేటా ఎలా వచ్చింది. సర్వే ప్రకారం పొలిటికల్ ఫ్రిపరెన్స్ ఉంది. అదే ప్రాంతంలో ఉన్నా..ఓటు తొలగించారు. ఈసీఐ కి ఫిర్యాదు చేస్తాం. వాళ్ళ గైడెన్స్ ప్రకారం భవిష్యత్ చర్యలు ఉంటాయి. కన్సాలిడేటెడ్ రిపోర్టు చేసి.తర్వాత యాక్షన్ చేపడతాం. ప్రస్తుతం మనకు జురిసిడిక్షన్ ఉంది. చట్టం ప్రకారం ముందుకెళతాం. సేవా మిత్ర యాప్‌ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే చేస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆధార్‌ నంబర్‌, విద్య, సామాజికవర్గం వివరాలు సేకరిస్తున్నారని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్‌ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. సేవా మిత్ర వెబ్‌సైట్‌లో బూత్‌ కన్వీనర్‌, డ్యాష్‌ బోర్డు వివరాలు ఉన్నాయన్నారు. సర్వేయర్ల నుంచి సమాచారం టీడీపీ బూత్‌ లెవల్‌ నేతలకు వెళ్తుందన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ తమ సర్వేయర్ల ద్వారా ఓటర్లకు ఫోన్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్‌ చేసి ఏ పార్టీకి ఓటు వేస్తారని తెలుసుకుంటున్నారని వివరించారు.

Next Story
Share it