Telugu Gateway
Cinema

‘సూర్యకాంతం’ మూవీ రివ్యూ

‘సూర్యకాంతం’ మూవీ రివ్యూ
X

కొణిదెల నిహారిక. ఎన్నో అడ్డంకులను అధిగమించి టాలీవుడ్ లోకి ప్రవేశించింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమెకు తొలి రోజుల్లో చాలా సవాళ్లే ఎదురయ్యాయి. అన్నింటిని అధిగమించి వెండితెరపై అడుగుపెట్టినా ఇప్పటివరకూ ఆమెకు ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా దక్కలేదు. వరస పెట్టి ప్రయత్నాలు చేస్తున్నా ఆమెకు ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది. ఈ తరుణంలో మరోసారి ‘సూర్యకాంతం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఆమెకు మరోసారి నిరాశే ఎదురైందని చెప్పొచ్చు. గత సినిమాలతో పోలిస్తే నిహారిక నటనలో ఈజ్ మరింత పెరిగినా...కథలో దమ్ములేకపోవటంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పొచ్చు. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే నిలకడలేని యువతిగా నిహారిక కన్పిస్తుంది. దీంతో ఆమె ను ప్రేమించిన యువకుడు ఎదుర్కొనే సమస్యలు ఏంటో అన్నదే ఈ సినిమా స్టోరీ. సూర్యకాంతం కన్పించకుండా పోవటంతో హీరో రాహుల్ మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు.

వీరిద్దరి మధ్య ప్రేమ ఫైనల్ స్టేజ్ కు చేరుకుని పెళ్లికి రెడీ అవుతున్న సమయంలో మళ్ళీ సూర్యకాంతం ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడిగా నటించిన రాహుల్ విజయ్ కు మంచి మార్కులే పడతాయి. సినిమా ఎక్కువగా నిహారిక చుట్టూనే తిరిగేలా ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ క‌థ‌ను సిద్ధం చేశాడు. స‌న్నివేశాల్లో క్లైమాక్స్ స‌న్నివేశాల్లో త‌ప్ప‌.. ఎమోష‌న్స్ పండినట్లు అన్పించదు. ఇక కామెడీ స‌న్నివేశాలు కూడా రొటీన్‌గా క‌న‌ప‌డ‌తాయి. ఎక్క‌డా న‌వ్వును తెప్పించవు. ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ స‌న్నివేశాల‌ను షార్ప్ ఎడిటింగ్‌తో ముందుకు న‌డిపించ‌లేక‌పోయాడు. కాబ‌ట్టి సినిమా బోరింగ్‌గా అన్పిస్తుంది. రాహుల్ విజ‌య్‌, పెర్‌లెని, శివాజీ రాజా, స‌త్య త‌దిత‌ర పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల పరిధి మేర చ‌క్క‌గా న‌టించారు. ఇక ఓవరాల్ గా చూస్తే ‘సూర్యకాంతం’ కూడా నిహారికుక హిట్ ఇవ్వలేకపోయిందనే చెప్పాలి.

రేటింగ్. 2.25/5

Next Story
Share it