ఎన్టీఆర్..చరణ్ ల సినిమాకు సుద్ధాల పాట
BY Telugu Gateway14 March 2019 11:30 AM IST
X
Telugu Gateway14 March 2019 11:30 AM IST
‘ఆర్ఆర్ఆర్’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తుండగా..దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ చిత్రాల ను తెరకెక్కించే డీవీవీ దానయ్యే ఈ సినిమా నిర్మాత. ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు మ్యూజిక్ డైరక్టర్ ఎం ఎం కీరవాణి. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సుద్ధాల అశోక్ తేజ సాహిత్యమందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరగుతున్నాయి. ఆర్ఆర్ఆర్లోని ఓ పాటకు అశోక్ తేజ సాహిత్య అందిస్తున్నట్టుగా తెలిపారు కీరవాణి.
Next Story