Telugu Gateway
Cinema

‘సీత’ టీజర్ విడుదల

‘సీత’ టీజర్ విడుదల
X

బెల్లంకొండ శ్రీనివాస్. సక్సెస్ లతో సంబంధం లేకుండా వరస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన చేస్తున్న సినిమా ‘సీత’ ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచింది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా కాజల్ నటిస్తోంది. ఆమె టైటిల్ రోల్ చేస్తుంది. టీజర్‌లో కూడా ఎక్కువగా హీరోయిన్‌ పాత్రనే ఫోకస్‌ చేశారు. ఇన్నాళ్లు సీరియస్‌ యాక్షన్‌ రోల్స్‌ లో కనిపించిన శ్రీనివాస్‌ ఈ సినిమా ద్వారా కొత్త మోడ్ లోకి వచ్చినట్లు కన్పిస్తోంది.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. ‘పెళ్ళి..సెంటిమెంట్లు నాకు వర్కవుట్ కావు’ అని కాజల్ చెప్పే డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలుస్తుంది. విలన్ టెంపరరీ కమిట్ మెంట్ కావాలని కోరితే..ఎన్ని రోజులు అంటూ కాజల్ ప్రశ్నిస్తుంది. ఆ వెంటనే నువ్వు సీతవు కావే..శూర్పణకవు అంటూ ఓ డైలాగ్ వస్తుంది. సీత టీజర్ ఆకట్టుకునేలా ఉంది. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

https://www.youtube.com/watch?time_continue=2&v=PrUgOWL6s08

Next Story
Share it