Telugu Gateway
Politics

చంద్రబాబు ప్రచారంలో ‘సింగపూర్ రాజధాని మిస్సింగ్’

చంద్రబాబు ప్రచారంలో ‘సింగపూర్ రాజధాని మిస్సింగ్’
X

అత్యంత కీలకమైన ఎన్నికల ప్రచారంలో ‘సింగపూర్ రాజధాని’ ఏదీ?. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ అంశాన్ని ఎందుకు వదిలేశారు. అమరావతి అద్భుత రాజధాని అంటున్నారు కానీ.. తనకు ఎంతో ఇష్టమైన సింగపూర్ తరహా రాజధాని ఊసెత్తటం లేదు ఎందుకు?. మోసం బట్టబయలు అవుతుందనా?. ‘నా ఇమేజ్ చేసి సింగపూర్ కంపెనీలు వచ్చాయి. ఉచితంగా మాస్టార్ ప్లాన్ ఇఛ్చాయి. స్లమ్స్ అయితే దేశీయ కంపెనీలతో కట్టించొచ్చు. ప్రపంచ స్థాయి రాజధాని కాబట్టే సింగపూర్ కంపెనీలను తెస్తున్నా’ అంటూ సంవత్సరాల తరబడి ఊదరగొట్టిన చంద్రబాబు అసలు ఇప్పుడు ఆ పేరు ఊసెత్తటం లేదు ఎందుకు? ఆ సింగపూర్ డిజైన్లు ఏమయ్యాయి. ఆ బొమ్మలు ఏమయ్యాయి. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలు కడుతున్నాయని ఏపీ ప్రజలను వంచించిన చంద్రబాబు ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా వదిలేశారు. పెద్దగా ఎక్కడా రాజధాని అంశాన్ని కూడా టచ్ చేయటం లేదు. స్టార్టప్ ఏరియా అని స్విస్ ఛాలెంజ్ పేరుతో అతి పెద్ద కుంభకోణానికి చంద్రబాబు తెరతీశారు. దీని కోసం ఏకంగా 1691 ఎకరాల భూమి కేటాయించారు సింగపూర్ కంపెనీలకు.

చంద్రబాబు గెలుపుపై నమ్మకం లేక ఈ సింగపూర్ సంస్థలు భూమి తీసుకుని ఏడాదిన్నర దాటిని ఇంత వరకూ అసలు అటువైపే చూడటం లేదు. రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీలను తెరపైకి వచ్చి..కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం వేల ఎకరాల భూములు కట్టబెట్టిన భాగోతం బయటకు వస్తుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు చంద్రబాబు అసలు సింగపూర్ రాజధాని అంశాన్ని చాలా కన్వీనెంట్ గా మర్చిపోయారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు కూడా పెద్దగా ఫోకస్ చేయటం లేదనే చెప్పొచ్చు. ఇదే సింగపూర్ రాజధాని అంటూ చూపించిన గ్రాఫిక్స్ ఏమయ్యాయని ఎవరూ అడిగే పరిస్థితి కూడా లేదు. దీంతో ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎక్కువ మోడీ, కెసీఆర్, జగన్ కుమ్మక్కు అనే అంశంపై ఫోకస్ పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. లేదంటే ఈ మూడున్న సంవత్సరాల కాలంలో రాజధాని భవనాల నిర్మాణం ప్రారంభం కాని విషయం చర్చకు వస్తుంది కదా?. సింగపూర్ కంపెనీలు రాజధాని కడతాయని చెప్పి..స్లమ్స్ కడతాయని చెప్పిన దేశీయ కంపెనీలకు చంద్రబాబు రాజధాని నిర్మాణ బాధ్యతలు ఎందుకు అప్పగించినట్లు?.

Next Story
Share it