Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు శుభవార్త

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు శుభవార్త
X

త్వరలోనే శుభవార్త చెబుతాం అని ప్రకటించింది హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ. ఎందుకంటే ఈ సంస్థే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయని..ఇవి పూర్తయిన వెంటనే..త్వరలోనే శుభవార్త చెబుతామని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అల్లు అర్జున్‌ టాలీవుడ్‌లో అడుగుపెట్టి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరువాత అల్లు అర్జున్ ఓకే చేసిన ప్రాజెక్టు ఇదే అన్న సంగతి తెలిసిందే. ఈ స్టైలిష్ స్టార్ కొత్త సినిమా ఏదీ ప్రారంభం కాకపోవటంతో ఆయన అభిమానులు గత కొంత కాలంగా హీరో ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని పంచే వార్తతో ముందుకొచ్చింది.

Next Story
Share it