శర్వానంద్ కొత్త సినిమా ‘జానకిదేవి’
BY Telugu Gateway5 March 2019 8:17 PM IST

X
Telugu Gateway5 March 2019 8:17 PM IST
శర్వానంద్, సమంత జోడీగా వస్తున్న సినిమా టైటిల్ ఏంటో తెలుసా?. అదే ‘జానకిదేవి’. తమిళ సినిమా 96 హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. తొలుత ఈ సినిమాపై సమంత ప్రతికూల వ్యాఖ్యలు చేసి..తర్వాత నాలుక కరుచుకున్న సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ కు ‘జానకి దేవి’ అనే టైటిల్ తో సినిమాను నిర్మించాలని యోచిస్తున్న చిత్ర యూనిట్ ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించటంతో ఈ చర్చ మొదలైంది. ఈ సినిమాలో సమంత గాయని జానకి అభిమానిగా కన్పించనుందని సమాచారం. తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెలుగు సినిమాను కూడా తెరకెక్కించనున్నారు.
Next Story