Telugu Gateway
Politics

ఐదు వేల చలాన్లు కట్టిన రేవంత్

ఐదు వేల చలాన్లు కట్టిన రేవంత్
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజీగిరి లోక్ సభ అభ్యర్ధి రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉండగా ఊహించని సంఘటన జరిగింది. ప్రచారంలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటనలు జరుపుతుండగా..న్యూబోయిన్ పల్లి సమీపంలోని తాడ్ బండ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు రేవంత్ వాహనాన్ని ఆపారు. అంతే కాకుండా.. వాహనంపై చలాన్లు కట్టాల్సి ఉంది అని చెప్పగా..ఆయన ఆ మొత్తం ఐదు వేల రూపాయలు కట్టి తిరిగి ప్రచారానికి బయలుదేరి వెళ్ళిపోయారు.

స్పీడ్ గా వెళ్లటంతో..తప్పుడు పార్కింగ్ కారణాలతో ఈ చలాన్లు విధించారు. గతంతో పోలిస్తే ఈ సారి రేవంత్ రెడ్డి హడావుడి ఎక్కువ చేయకుండా కామ్ గా తన ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా లోక్ సభ బరిలో విజయం సాధించే దిశగా ఆయన వ్యూహాలు రచించుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన మర్రి రాజశేఖరరెడ్డి పూర్తిగా తన మామ, మంత్రి మల్లారెడ్డిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇమేజ్ పరంగా చూసుకుంటే రేవంత్ తో రాజశేఖరరెడ్డి ఏ మాత్రం మ్యాచ్ కాలేరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it