Telugu Gateway
Cinema

కొత్త సినిమాకు రెడీ అవుతున్న రవితేజ

కొత్త సినిమాకు రెడీ అవుతున్న రవితేజ
X

గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సీనియర్ హీరో రవితేజ మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టారు. ఈ హీరో ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో హిట్ అయిన తేరి సినిమాను సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తమిళంలో విజయ్‌ హీరోగా తెరకెక్కిన సినిమాను తెలుగు నేటివిటీ, రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు కనకదుర్గ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ కు జోడీగా కాజల్, క్యాథరిన్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్.

Next Story
Share it