రష్మి కారు యాక్సిడెంట్
BY Telugu Gateway18 March 2019 8:55 AM GMT
X
Telugu Gateway18 March 2019 8:55 AM GMT
ప్రముఖ యాంకర్, నటి రష్మీ ప్రయాణిస్తున్న కారు ఓ ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జాతీయ రహదారి కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో సమీపంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. రష్మీ అనకాపల్లిలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి గాజువాకకు వస్తుండగా కూర్మన్నపాలెం డిపోకు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ...రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది.
ఈ ఘటనలో చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన లారీ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక సంఘటన సమయంలో రష్మీతో పాటు ఆమె తల్లి కూడా కారులో ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ ఎం.ఎ.గౌతమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story