Telugu Gateway
Andhra Pradesh

వైసీపీలో చేరిన పీవీపీ..శివాజీరాజా

వైసీపీలో చేరిన పీవీపీ..శివాజీరాజా
X

ప్రతిపక్ష వైసీపీలోకి వరస పెట్టి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఆ పార్టీలో కొత్త జోష్ ను తీసుకొస్తోంది. లోక్ సభలో టీటీడీ పక్ష నేత తోట నరసింహం, ఆయన భార్య వాణిలు బుధవారం నాడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తోట నర్సింహం బదులు తోట వాణికి అసెంబ్లీ సీటు ఖరారు చేయటం ఖాయం అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వీళ్ళతో పాటు విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌, నటుడు రాజారవీంద్ర కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.విజయవాడ మాజీ మేయర్‌ రత్నబిందు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

Next Story
Share it