Telugu Gateway
Cinema

అదరగొడుతున్న ‘పులిజూదం’ ట్రైలర్

అదరగొడుతున్న ‘పులిజూదం’ ట్రైలర్
X

మోహన్ లాల్.. విశాల్..శ్రీకాంత్. హన్సిక. రాశీ ఖన్నా. భారీ తారాగణంతో వస్తున్న సినిమానే ‘పులిజూదం’ ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ లో మోహన్ లాల్, విశాల్, శ్రీకాంత్ ల డైలాగ్ లు..యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రతి హీరోలో ఓ విలన్ ఉంటాడు. ప్రతి విలన్ లో ఓ హీరో ఉంటాడు అంటూ మోహన్ లాల్ చెప్పే డైలాగ్ సూపర్ అనేలా ఉంది.

తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కింది. హన్సిక ఈ సినిమాలో ఓ బార్ డ్యాన్సర్ గా కన్పించనుంది. తెలుగు హీరోగా పలు సినిమాల్లో నటించిన శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ గా కన్పించబోతున్నాడు. ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

https://www.youtube.com/watch?time_continue=82&v=Rdkvtvu2RXs

Next Story
Share it