Telugu Gateway
Politics

పవన్ కళ్యాణ్ నీది కొబ్బరికాయల వ్యాపారమా?

పవన్ కళ్యాణ్ నీది కొబ్బరికాయల వ్యాపారమా?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ, వైసీపీ నేత పృథ్వీ సూపర్ పంచ్ ఇచ్చారు. ప్రజాక్షేత్రంలో ఉన్నామనే సంగతి మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. మాట్లాడితే తొక్క తీస్తా.. తోలు తీస్తానంటున్నావు నీది ఏమైనా కొబ్బరికాయల వ్యాపారమా? అని ప్రశ్నించారు. చేతనైతే అవినీతి చేసే టీడీపీ నేతల తోలు తీయ్యండి అని వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైన ప్రభుత్వ పాలనను విమర్శిస్తాడని, ప్రతిపక్ష నాయకుడిని విమర్శించే అసమర్థనాయకుడు జనసేన అధ్యక్షడు పవన్‌ అని విమర్శించారు.

ఓటు కూడా ఏ తేదీన వేయాలో తెలియని మంగళగిరి మాలోకం లోకేష్‌ని ఒక్క మాటైన అన్నావా? నువ్వా ప్రజాక్షేత్రంలో అవినీతిని ప్రశ్నించేది? అని మండిపడ్డారు. ఏప్రిల్‌ 11న జరగబోయే ఎన్నికల్లో టీడీపీతోపాటు నీ పార్టీని కూడా ప్రజలు భూస్థాపితం చేస్తారన్నారు. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వీధి నాటకాల ద్వారా సినిమా కళాకారులమంతా టీడీపీ అవినీతిని ప్రజలకు తెలియజేస్తామన్నారు.

Next Story
Share it