ప్రేమకథా చిత్రమ్ 2 ట్రైలర్ రిలీజ్
BY Telugu Gateway8 March 2019 8:41 AM GMT

X
Telugu Gateway8 March 2019 8:41 AM GMT
ప్రేమ కథా చిత్రమ్ పేరు వినగానే ఈ సినిమాలో సాగిన కామెడీ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. సుమంత్ అశ్విన్ హీరోగా ఈ సీక్వెల్ ను తెరకెక్కించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కూడా ఫన్నీగా ఉంది.
మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించారు. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=RJcXjj3EzfI
Next Story