చంద్రబాబుకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్
BY Telugu Gateway19 March 2019 7:27 AM GMT

X
Telugu Gateway19 March 2019 7:27 AM GMT
‘బీహారి బందిపోటు’ అంటూ తనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఓటమి కళ్ళ ముందు కనపడుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు సహజమేనని ఎద్దేవా చేశారు. బీహర్ ను కించపర్చేలా వ్యాఖ్యలు చేయటం తగదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో కామెంట్ పెట్టారు ప్రశాంత్ కిషోర్. ‘ఓటమి తథ్యమని తేలడం ఎంతటి రాజకీయ నాయకుడినైనా దెబ్బతీస్తుంది.
చంద్రబాబునాయుడు ఉపయోగిస్తున్న భాష నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. సర్‌జీ బీహార్‌ను కించపరిచేలా దుర్భాషలాడటం కన్నా.. ఏపీ ప్రజలు మీకు ఓటు ఎందుకు వెయ్యాలనే దానిపై ఫోకస్ చేయాలి’ అని ప్రశాంత్ కిషోర్ హితవు పలికారు. ఒంగోలు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ.. బీహార్ బందీపోటు ప్రశాంత్ కిషోర్ ఏపీలో లక్షలాది ఓట్లను తొలగించారని ఆరోపించారు.
Next Story