Telugu Gateway
Cinema

వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్

వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్
X

వెంకటేష్ చాలా గ్యాప్ తర్వాత ‘ఎఫ్ 2’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు అదే జోష్ లో ఉన్నారు ఈ సీనియర్ హీరో. ఎఫ్ 2లో వెంకటేష్ కు జోడీగా సీనియర్ హీరోయిన్ తమన్నా జోడీగా నటించగా..కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన పాయల్ రాజ్ పుత్ వెంకటేష్ తో జోడీ కట్టడానికి సై ఆనటం ఆసక్తికరంగా మారింది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో మొదలైన విషయం తెలిసిందే. వెంకీ, నాగచైతన్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల రాశీఖన్నా ఈ సినిమా సెట్‌లో జాయిన్‌ అయ్యారు. తాజాగా పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా జత అయ్యారు. ‘కొత్త తెలుగు సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను సూపర్‌ ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు పాయల్‌.

Next Story
Share it