Telugu Gateway
Cinema

‘భీష్మ’గా నితిన్

‘భీష్మ’గా నితిన్
X

‘భీష్మ’గా రాబోతున్నాడు హీరో నితిన్. అంతే కాదు..ఈ సినిమాకు ఓ ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ కూడా ఉంది. అది కాస్తో కూస్తో నితిన్ కు సెట్ అయ్యేలా ఉంది. అదేంటి అంటే భీష్మ సినిమా ట్యాగ్ లైన్ సింగిల్ ఫర్ ఎవర్. అంటే ఎప్పటికీ ఒంటరిగానే ఉంటాడట. నితిన్ కు పెళ్ళి కాలేదన్న విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం సినిమా కోసమే తప్ప..నిజ జీవితానికి వర్తించదంటున్నాడు హీరో. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో నితిన్ కు జోడీగా రష్మిక నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.

నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన చేశారు. ‘‘తొమ్మిది గ్రహాలు.. ఏడుసముద్రాలు.. 204 దేశాలు... మూడు బిలియన్స్‌ పైగా అమ్మాయిలు ఉన్నారు. కానీ అతను స్టిల్‌ సింగిల్‌ గానే ఉన్నాడు’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. మరి.. సినిమాలో భీష్మ బ్యాచిలర్‌ లైఫ్ కు ఫుల్‌స్టాప్‌ పెట్టించడానికి హీరోయిన్‌ ఏం చేసింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. పూర్తి స్థాయి కామెడీ సినిమాగా ఇది తెరకెక్కించనునన్నట్లు సమాచారం.

Next Story
Share it