Telugu Gateway
Politics

పాలన అంటే గోళీలాట కాదు జగన్

పాలన అంటే గోళీలాట కాదు జగన్
X

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి, టీటీడీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం నాడు మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పాలన అంటే గోళీలాట కాదు అంటూ ఎద్దేవా చేశారు. ‘ఇంట్లో చిన్న పిల్లలకు బండి తాళాలు ఇస్తామా?. కారు తాళాలు ఇస్తామా? ఇవ్వం. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయి. కారులో ఉన్న వాళ్లు చనిపోవచ్చు. రోడ్డు మీద ఉన్న వాళ్ళు చనిపోవచ్చు. అలాంటిది పదహారు నెలలు జైలులో ఉన్న వ్యక్తికి ఏపీ తాళాలు ఇస్తామా?. ఆయన ఈ మధ్య అడుగుతున్నారు ఓ ఛాన్స్ ఇవ్వమని.

ఇది ఏమైనా గోళీల ఆటా? ఛాన్స్ ఇవ్వటానికి. ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఏమీ లేదు. ఉన్న అనుభవం జైలులో కూర్చున్నది మాత్రమే. జగన్ ఎప్పుడు పరిపాలించలా? ఇప్పుడు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఉండబట్టే పెన్షన్ టైమ్ కు వస్తోంది. సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పొరపాటున గెలిస్తే ఆయనకు అనుభవం లేదు. అన్నీ ఆగిపోతాయి. అమరావతినే మార్చాలనుకుంటున్నాడు ఆయన ఎంత అహంకారం. ఎందుకు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కెసీఆర్ కు తాకట్టుపెడుతున్నారో వైసీపీ నేతలు ప్రజలకు చెప్పాలని అడుగుతున్నా.’ అంటూ జగన్ పై మండిపడ్డారు లోకేష్.

Next Story
Share it