టీఆర్ఎస్ కండువా కప్పుకున్న నామా
BY Telugu Gateway21 March 2019 11:28 AM GMT

X
Telugu Gateway21 March 2019 11:28 AM GMT
టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. నామ నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నేతలు బేబి స్వర్ణకుమారి, అమర్నాథ్ బాబు, అట్లూరి రమాదేవి, బ్రహ్మయ్య తదితరులు కూడా టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ తరఫున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు నామా ప్రకటించారు.
Next Story