Telugu Gateway
Politics

మోడీ..‘మహానాయకుడు’ చూడు నా శక్తి తెలుస్తుంది

మోడీ..‘మహానాయకుడు’ చూడు నా శక్తి తెలుస్తుంది
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నాడు కర్నూలు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యాత్తూ ప్రధాని నరేంద్రమోడీని ‘మహానాయకుడు’ సినిమా చూడాలని కోరారు. ఈ సినిమా చూస్తే తన శక్తి ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 30 సంవత్సరాల క్రితమే తన శక్తి ఏంటో చూపించామని వ్యాఖ్యానించారు. అలాంటిది తాము ఇప్పుడు మోడీకి భయపడతామా? అని ప్రశ్నించారు. ‘నామీదే 26 బాంబు లు వేశారు. అలాంటి వాటికే భయపడలేదు. తాటాకు చప్పళ్ళకు భయపడను. మోడీకి నేను భయపడతానా?. జగన్ కు ఓటేస్తే నరేంద్రమోడీకి ఓటేసినట్లే. ఇప్పుడు చూస్తే అసదుద్దీన్ కూడా ఏపీకి వస్తానంటున్నాడు. రమ్మంటున్నా. నరేంద్రమోడీ, కెసీఆర్, జగన్ అందరూ కలసి మైనారిటీలు...రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఖబడ్దార్. ఏపీకి వచ్చి అన్యాయం చేయాలని చూస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. నా దగ్గర పెరిగిన కెసీఆర్ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట. కెసీఆర్ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడ అని అడుగుతున్నా. దేనికైనా పద్దతి ఉండాలి.

యుద్ధాన్ని కూడా రాజకీయ లబ్ది కోసం పనిచేస్తున్నారు. చాలా దుర్మార్గం. నేనేదో పాకిస్థాన్ కు ఊతం ఇచ్చేలా మాట్లాడాం అని. ఐదు కోట్ల ఆంధ్రులు దేశభక్తిలో ఎవరికీ వెనకుండరు. అభినందన్ ను అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. యుద్ధం చేస్తామని రెండేళ్ళ ముందు చెప్పారని ఇదే జిల్లాలో పవన్ కళ్యాణ్ ఇదే జిల్లాలో చెప్పారు. యుద్ధం చేస్తే ఓట్లు వస్తాయా?. ప్రజలను కాపాడితే ఓట్లు వస్తాయి. ప్రజల కోసం పనిచేస్తే ఓట్లు వస్తాయి. ఓట్ల కోసం యుద్ధం చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తారు. పుల్వామా ఫెయిల్ అయ్యారు అంటే మీరు కారణం కాదా? అని అడుగుతున్నా?. మోడీ ఎదురుదాడికి భయపడను. న్యాయం కోసం పోరాటం చేస్తా. ఢిల్లీలో ఉండి అభినందన్ కు స్వాగతం పలికి ఉంటే నేను అభినందించేవాడిని. మీకు రాజకీయం కావాలి. రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. దేశ ప్రజానీకం మోసం చేయటానికి సిద్ధంగా లేరు.

ఐదేళ్ళ మీ పాలనలో ఎవరికీ ఆనందం లేదు. రైతులు చితికిపోయారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యాయి. పేదవాళ్ళ జీవితం అతలాకుతలం అయింది. నోట్ల రద్దు పేదవాడికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. మీ జీఎస్టీ, మీ దాడులు దేశాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారని..హైదరాబాద్ లో మన కోసం పనిచేస్తున్న కంపెనీ మీద కేసులు పెడతారా?. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని. మాకు సేవ చేసే కంపెనీకి మీ ఏసీపీలు వచ్చి దౌర్జన్యం చేస్తారా?. అంత తేలిగ్గా వదిలిపెట్టం. కెసీఆర్ మన ఆస్తులపై దాడి చేస్తూ మనల్ని భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. అనవసరంగా రెచ్చిపోతే మేం కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టం. ఏ అధికారంతో మా కంపెనీలోకి వచ్చారు

Next Story
Share it