‘మహర్షి’ విడుదల మే 9న
BY Telugu Gateway6 March 2019 3:52 PM IST

X
Telugu Gateway6 March 2019 3:52 PM IST
మహేష్ బాబు, పూజా హెగ్డె జోడీగా నటిస్తున్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమా వాస్తవానికి వచ్చే నెలలో విడుదల కావాల్సి ఉంది. ముందు ఏప్రిల్ 5 అన్నారు..తర్వాత 25కి మార్చారు. ఇప్పుడు ఏకంగా మే 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో మహేష్ బాబు అభిమానులు సినిమా విడుదల కోసం మే వరకూ ఆగాల్సిందే.
మార్చి 17 నాటికి సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుందని..ఇంకా రెండు పాటల చిత్రీకరణం పెండింగ్ లో ఉందని తెలిపారు. అల్లరి నరేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Next Story