Telugu Gateway
Cinema

‘జై బాలయ్య’ అంటున్న వర్మ

‘జై బాలయ్య’ అంటున్న వర్మ
X

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం ఓ వైరెటీ ట్వీట్ చేశారు. కంటెంట్ లో వెరైటీ ఏమీ లేకపోయినా తన ట్వీట్ చివర్లో జై బాలయ్య అని నినాదం చేయటమే వెరైటీ. ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు ఓపెన్సింగ్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇదే విషయాన్ని వర్మ థియేటర్లలో బుకింగ్ కు సంబంధించి స్క్రీన్ షాట్ ను జతచేసి మరీ...ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథనాయకకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడటానికే ప్రజలు ఎగబడుతున్నారు. అంటే నిజంగా నిజమే గెలిచిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

జై బాలయ్య అంటూ ముగించేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షోతోపాటు తొలి రోజు సినిమాకు స్టార్ హీరోలకు ఉన్న రేంజ్ లో బుకింగ్స్ ఉండటం ఆసక్తికర పరిణామం. మరి ఈ సినిమా ద్వారా వర్మ ఎన్ని సంచలనాలు నమోదు చేస్తారో వేచిచూడాల్సిందే. గత కొంత కాలంగా సరేన హిట్ లేక ఇబ్బందిపడుతున్న వర్మకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అయినా ఓ బ్రేక్ ఇస్తుందా? లేదా అన్నది శుక్రవారం నాడు తేలిపోనుంది.

Next Story
Share it