కర్నూలులో వైసీపీ వర్సెస్ టీడీపీ ఫైటింగ్
BY Telugu Gateway16 March 2019 7:55 AM GMT

X
Telugu Gateway16 March 2019 7:55 AM GMT
ఎన్నికల ప్రచారంలో వేడి రాజుకుంటుంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం ఖగ్గల్లులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి శనివారం ఉదయం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైసీపీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు.
దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరపగా అందులో టీడీపీ అభ్యర్ధి తిక్కారెడ్డితోపాటు, అక్కడే ఉన్న ఏఎస్ఐ కూడా గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాయి. ఈ ఘటనపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎంత తీవ్రంగా మారుతుందో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Next Story